Playfully creates and annihilates…

SiSuvu maMTa neddu jēyuchu jerachuchu
nāDu naTla pōle nikhilabhūta
sRshTi dāna chēyu jerachu napparamātma
yidi nijaMbu saMSayiMpa valadu.
(NaMdi mallaya-GhaMTa siMgaya’ Varāha purāNamu)

ఆ. శిశువు మంట నెద్దు జేయుచుఁ జెఱచుచు
     నాడు నట్ల పోలె నిఖిలభూత
     సృష్టిఁ దాన చేయుఁ జెఱచు నప్పరమాత్మ
     యిది నిజంబు సంశయింప వలదు.
     (నంది మల్లయ, ఘంట సింగయ, వరాహ పురాణము, ద్వితీయాశ్వాసం, 19)

As a child with wet-soil makes and destroys
Playfully oxen and buffalo, so the Almighty God
Creates and then annihilates all living things
And non-living, that is true, not to be doubted.

చిన్న పిల్లవాడు మట్టితో ఎద్దు మొదలగు బొమ్మలను చేసి, చెరిపేసి, అదే ఆటగా ఆడుకుంటాడో, అలాగే పరమాత్మ కూడా సకలచరాచర సృష్టి తానే చేస్తాడు, మళ్ళీ తానే చెరిపేస్తాడు. అది నిజం! అందులో సందేహించవలసింది లేదు!

Poetic Sayings – 9

Power of time

kālamu sarva carācara
jālamunku nāSakamunu janakambunu, da
dkālambunu vamcimpaga
jālaDu kālātmuDaina jalajōdaruDun.
(from HarbhaTTu’s ‘varāha purāNamu’)

కం. కాలము సర్వచరాచర
      జాలమునకు నాశకమును జనకంబును, ద
      ద్కాలంబును వంచింపఁగ
      జాలడు కాలాత్ముఁడైన జలజోదరుఁడున్.
(హరిభట్టు, వరాహపురాణము, ద్వితీయాశ్వాసం, 68)

Time causes the creation and extinction
Of things animate and inanimate on earth
Even Brahma, who is time’s manifestation
Can not venture to reverse its destined path.