They are hot-tongued; their words have power….

noccheno vīrala hRdayamu
licchaTa nāmīda naligi yēmani SāpaM
bicchedarō kada nāluka
vecchana munulakuni ginuka vēgama vacchun.
(from Pillalamarri pinavīrana’s ‘SruMgāra SākuMtalamu’)

క. నొచ్చెనొ వీరల హృదయము
    లిచ్చట నామీఁద నలిగి యేమని శాపం
    బిచ్చెదరో కద నాలుక
    వెచ్చన మునులకును గినుక వేగమ వచ్చున్.
   (పిల్లలమఱ్ఱి పినవీరన, శృంగార శాకుంతలం, ద్వితీయాశ్వాసం, 35)

In case they are hurt in their kindly heart
They would get very angry and spell out
What sort of curse none would know; hot
Tongued are sages, angered soon they get.

‘నాలుక వెచ్చన’ అంటే ‘మాటకు ప్రభావం చాలా ఎక్కువ’ అని అర్ధం. పద్యంలో తెలుగు నుడికారాన్ని సొగసు చెడకుండా ప్రయోగించిన కవులలో పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవిది ప్రముఖ స్థానం అనే చెప్పాలి. ఈయన ఉపయోగించిన పదబంధాలలో ఇప్పుడు ప్రయోగంలో లేనివే ఎక్కువ. వేటలో భాగంగా ఒక హరిణాన్ని తరుముతూ కణ్వాశ్రమం వైపుకు వెళుతూంటాడు దుష్యంతుడు. దారిలో ఒక మునిపుంగవుడు దర్శనమిచ్చి ‘ఈ హరిణం కణ్వ మహాముని ఆశ్రమానికి చెందినది. ఆ ఆశ్రమంలో అందరి చేత ప్రేమగా సాకబడే ముద్దుబిడ్డ వంటిది!’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న దుష్యంతుడి బెదిరిన మనసులో మెదిలే ఆలోచన పై పద్యం. ‘మునులకు కోపం తృటిలో వస్తుంది. కోపంలో వాళ్ళ మాటకు ప్రభావం చాలా ఎక్కువ. ఏమి శాపం తగలబోతోందో ఏమో!’ అని దుష్యంతుడు పడే కంగారు ఈ పద్యంలో భావం.

King Dushyant was unknowingly casing a deer belonged to the hermitage of the great sage KaNva. On the way he was intercepted by another sage who revealed that the deer belonged to the sage KaNva and that by chasing the deer which was very dear to the heart of the sage KaNva, he was not doing the correct thing.

After listening to the factual position pertaining to the deer, king Dushyant got worried and what he thought in his mind was the essence of the above poem. He thought that in case the sages were unnecessarily hurt, they were capable of spelling out curses that would make even the mightiest king lose his kingdom. Since such was the power of the tongue of the pious sages, one needed to be doubly careful while dealing with them.