
kapulu hitōchita kriyalu gaikoni chēyuTayuM, bayōdhipai
vipula SilāparaMparalu vēsina dēluTyun, narul narā
dapula jayiMpa būnuTyu dā viparīta maTaMchu RāvaNuM
DapuDu dlaMche gāni kanaDayyenu Rāmu prabhāva meMtayun.
(KaMkaMTi Pāparāju, Srimaduttara rāmāyaNamu)
చ. కపులు హితోచిత క్రియలు గైకొని చేయుటయుం, బయోధిపై
విపుల శిలాపరంపరలు వేసినఁ దేలుటయున్, నరుల్ నరా
దపుల జయింప బూనుటయుఁ దా విపరీతమటంచు రావణుం
డపుడు దలంచెఁ గాని కనఁడయ్యెను రాము ప్రభావ మెంతయున్.
(కంకంటి పాపరాజు, శ్రీమదుత్తర రామాయణము, ప్రథమాశ్వాసము, 73)
Apes doing the deeds required and beneficial on their own,
Floating of big boulders thrown into the water of the sea,
Men waging war and winning over the monsters; RavaNa
Thought unnatural but did not see in all the magic of Srirama.
Writing poetry, at times, appears is nothing more than thinking differently and presenting the idea differently. When a good idea strikes the imagination of the poet, the poet tries to present the idea couched in the finest of words possible at the earliest juncture possible. The above poem taken from the work Srimaduttara RamayaNamu, written by KaMkaMTi Paparaju is a good example for one such instance.
In the above poem, the poet says that the king of Asuras, RavaNa was thinking amazingly about the astonishingly disciplined hard work done by the apes, the unthinkable occurrence of big boulders thrown into the water of ocean floating so that they could be arranged in the form of a long bridge for the apes to travel on it and reach Lanka, the unthinkable dare of the human beings waging war on the powerful Asuras with a view to secure win over them – all these appeared to RavaNa as too unnatural but he could not see in all of them the divine influence and the power of Lord Srirama.
‘సీతాన్వేషణ’ అనే బృహత్కార్యంలో – అప్పటికి యేది ఉచితమైనదో ఊహించి ఆ కార్యాన్ని సాధించడానికి వానరములు పూనుకోవడం, సముద్రంపై వారధి నిర్మించే క్రమంలో పెద్ద పెద్ద బండరాళ్ళు వేస్తే అవి నీటిపై తేలడం, రాక్షసుల పేరు వింటేనే భయంతో వణికిపోయే నరులు రాక్షసులపైనే పోరుకు సిద్ధపడి యుద్ధంలో గెలవాలనుకోవడం…ఇవన్నీ రావణునికి విపరీతాలుగా అనిపించాయి కాని, శ్రీరాముడి ప్రభావంతోనే ఇవి సాధ్యమైనాయన్న అసలు సంగతి మాత్రం ఎంతకూ రావణుడి గ్రహింపుకు రాలేదు అన్నది పై పద్యంలో భావం.
You must be logged in to post a comment.